కర్మ

మార్చి 18, 2009

కర్మ బంధహేతువు అని అంటున్నారు. అలాగనె కర్మ చేయకుండా వుండటము సాధ్యము కాని పని. అందువలన నేను కర్తను కాదు, భగవంతుడే కర్త అనే భావనతో కర్మాచరణ చేసిన వారిని కర్మ బంధించదు. నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలి పెట్టి, ఇది భగవంతుని  ద్వారానే జరుగుతున్నది, దీనికి ఫలము కూడా భగవంతుని ఆజ్ణ చేతనే లభిస్తుంది అని గుర్తు పెట్టుకోవాలి. కర్మ ఫల ప్రదాత భగవంతుడే అని గుర్తు పెట్టుకున్నపుడు ఆ ఫలము ఎటువంటిది అయినా భగవంతుని ప్రసాదముగా భావిస్తాము. అన్నింటిని భగవంతుని ప్రసాదంగా భావించినపుడు కష్టమైనా, సుఖమైనా ఆనందంగా స్వీకరించె లక్షణం సాధకులకు ఏర్పడుతుంది.  ఆద్యాత్మికముగా  ముందుకు వెళ్ళాలి అనుకునే వారికి ఇటువంటి భావన చాలా అవసరము.

ఇటువంటి భావన వున్న వాళ్ళు బంధ హేతువు అయినటువంటి కర్మను భగవంతుని చేరటానికి మెట్టుగా తయారు చేసుకుంటారు.